• Login / Register
  • SriShailam - Andhra Pradesh | కన్నుల పండువగా కార్తీక లక్షదీపోత్సవం

    SriShailam - Andhra Pradesh |  కన్నుల పండువగా కార్తీక లక్షదీపోత్సవం
     పుష్కరిణికి దశ హరతులు - శ్రీ‌శైలంలో పోటెత్తిన భక్తులు

    Telangana, Hyderabad : ఏపీలోని (Andhra Pradesh)  నంద్యాల జిల్లాలో కొలువు దీరిన‌ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ శైలం,  శైవ పుణ్య క్షేత్రమైన‌ శ్రీ గిరి క్షేత్రంలో కార్తీకమాసం సందడి మొద‌లైంది. కార్తీక మాసం మొదటి రోజు సంద‌ర్భంగా సోమవారం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం నిర్వ‌హించారు. అలాగే దశ హారతులిచ్చారు. సోమ‌వారం కార్తికమాసం మొదటి కావడంతో పుష్కరిణి వద్దే దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా నిర్వ‌హించారు. మల్లన్న పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేశారు. అర్చకులు, వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం ఉత్సవ మూర్తులకు, పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశ హరతులిచ్చి భక్తులను దీవించారు. ఈ క్ర‌మంలో దశ హారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి వద్దకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంత‌మంతా భక్తులతో కిట కిటలాడింది. కార్తీకమాసం తొలి రోజు ఉదయం నుంచి శ్రీశైల మ‌ల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఈ లక్షదీపోత్సవంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులతో పాటు ఆలయ అధికారులు, భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు.
    *  *  * 

    Leave A Comment